పెళ్ళికొడుకు అవుతున్న ప్రభాస్…. ఉమైర్‌ సంధు సంచలన వ్యాఖ్యలు…

తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ బలమైన ఫ్యాన్ బేస్ ను ఏర్పరచుకున్న డైనమిక్ హీరో ప్రభాస్. ప్రేక్షకులు ముద్దుగా డార్లింగ్ అని పిలుచుకునే ప్రభాస్ పెళ్లి ఇండస్ట్రీలోనే పెద్ద టాక్ గా నిలిచింది. ఎప్పుడూ సోషల్ మీడియాలో ప్రభాస్ పెళ్లి గురించి ఏదో ఒక వార్త హాట్ టాపిక్ గా వస్తూనే ఉంటుంది.

Prabhas
Prabhas

తన సినిమాలు నటించిన ప్రతి హీరోయిన్తో త్వరలో ప్రభాస్ కి పెళ్లి కాబోతోంది అన్న రూమర్స్ విని విని అభిమానులు కూడా విసుగు చెందారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మరోసారి ప్రభాస్ పెళ్లి వార్త వైరల్ అయింది. త్వరలో బాలీవుడ్ హీరోయిన్ కృతీసనన్‌తో ప్రభాస్ ఎంగేజ్మెంట్ జరగబోతోంది అని ప్రచారం జరుగుతోంది. ప్రభాస్ తో జరిగిన బాలయ్య అన్‌స్టాపబుల్ ఎపిసోడ్‌లో ఇదే విషయాన్ని ప్రస్తావించినప్పుడు ప్రభాస్ సమాధానం చెప్పకుండా దాటి వేయడం పలు అనుమానాలకు దారితీసింది.

Prabhas
Prabhas

ఎంగేజ్మెంట్ కి వేదిక కూడా సిద్ధమైందని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్నారు. ఈ రూమర్‌కి ఒక స్ట్రాంగ్ కారణం ఉందనే చెప్పొచ్చు. ప్రముఖ బాలీవుడ్ క్రిటిక్ అయినా ఉమైర్‌ సంధు ‘వచ్చేవారం మాల్దీవుల్లో ప్రభాస్‌, కృతీసనన్‌ నిశ్చితార్థం జరగబోతోంది, ఆ జంట ఒక్కటవడం నాకు ఆనందం కలిగిస్తోంది’ అని ట్వీట్‌ పెట్టాడు.

Prabhas
Prabhas

దాంతో ఈ ట్వీట్ ప్రస్తుతం బాలీవుడ్ మరియు టాలీవుడ్ లో భారీ ఎత్తున చర్చలకు దారితీసింది. మరోపక్క ఇదంతా అబద్ధమని కేవలం తను పాపులర్ అవ్వడం కోసం ఉమైర్‌ ఇటువంటి అబద్ధపు ట్వీట్లు చేస్తుంటాడని నెటిజనులు అతన్ని ట్రోల్ చేస్తున్నారు.‘ఆదిపురుష్‌’ లో ప్రభాస్‌తో కలిసి కృతీసనన్‌ నటిస్తోంది. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు అని బాలీవుడ్‌లో వచ్చిన వార్తలను ఆమె ఈ మధ్యనే ఘాటుగా ఖండించింది.

google news

Leave a Comment