చిరు లీక్స్‌తో ఫ్యాన్స్‌లో ఆసక్తి పెంచుతున్న భోళా శంకర్..

మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళాశంకర్ చిత్రం నుంచి జామ్ జామ్ జజ్జనక  అంటూ సాగే రెండో పాట విడుదల ద్వారా నిన్నటి వరకు ట్రెండింగ్‌లో ఉంది. తాజాగా ఈ చిత్రం మరోసారి ట్రెండ్ అవుతోంది. మెగాస్టార్ చిరంజీవి చిరు లీక్స్ పేరిట ట్విట్టర్‌లో విడుదల చేసిన వీడియోనే దీనికి కారణం. దాదాపు నిమిషం పాటు నిడివి ఉన్న ఈ వీడియోలో చిరంజీవి భోళా శంకర్ సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ప్రస్తుతం చిరు విడుదల చేసిన ఆ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అభిమానులను ఫుల్ ఖుషీ చేసేస్తోంది.

ఇప్పటివరకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆయన నటించిన సినిమాల్లో మెగాస్టార్ చిరంజీవి నటించిన సూపర్ హిట్ సినిమాల్లోని డైలాగ్స్ లేదా పాటలు.. సందర్భానుసారంగా పాడడం లేదా మాట్లాడడం మనం ఇప్పటికే చాలాసార్లు చూశాం. ఈసారి ఆ ట్రెండ్‌ని మెగాస్టార్ ఫాలో అవుతున్నారట. పవన్ కళ్యాణ్ డైలాగ్స్‌, మేనరిజమ్స్‌ని భోళాశంకర్ సినిమాలో చిరు అనుసరించారట. అలాగే వీడియో చివరిలో రష్మి గౌతమ్ కూడా కనిపించింది. వీరిద్దరి కాంబోలో ఓ పాట కూడా ఉండనుందని వీడియో చూస్తుంటే అభిమానులకు అర్థమవుతోంది.

మెహర్ రమేష్ దర్శకత్వంలో ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్ పై రూపొందిస్తున్న భోళాశంకర్ సినిమా ఆగస్టు 11న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాలోని ఒక్కో పాటను వరుసగా విడుదల చేస్తూ వస్తున్నారు మూవీ టీం. అలాగే ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో తలమునకలై ఉంది. తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన వేదాళం సినిమాకు రీమేక్‌గా భోళాశంకర్‌ను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన మొదటి పాటతో అభిమానులంతా ఇంకా భోళా మానియాలో ఉండగానే జామ్ జామ్ జజ్జనక అంటూ సాగే పాటతో ఒకేసారి పార్టీ మోడ్‌లోకి వెళ్లిపోయారంతా. ఈ చిత్రంలో మెగాస్టార్ సరసన కథానాయికగా తమన్నా నటిస్తుండగా; చెల్లెలి పాత్రలో కీర్తి సురేశ్ నటిస్తోంది.

చిరు లీక్స్ పేరిట మెగాస్టార్ చేస్తున్న ట్వీట్స్ నెట్టింట వైరల్‌గా మారడమే కాదు.. ఆయన అభిమానుల్లో అంచనాలను సైతం విపరీతంగా పెంచేస్తున్నాయి. అందుకే తదుపరి లీక్ కోసం అంతా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

google news

Leave a Comment