బుల్లితెరలో అయినా వేదిక పైన అయినా శ్రీముఖి తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఇట్టే ఆకర్షిస్తుంది. బిగ్‌బాస్ ఫేమ్ తర్వాత శ్రీముఖి మంచి ప్రజాదరణ పొందిన యాంకర్ గా ఎదిగింది.

ఎంతో అందంగా ఉండే శ్రీముఖి అద్భుతమైన బ్లూ కో-ఆర్డ్ లెహంగాతో తీసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది.

శ్రీముఖి ఈ డ్రెస్ కి కాంట్రాస్ట్ గా గోల్డ్ కలర్ ఇయర్ రింగ్స్ మరియు గోల్డ్ కలర్ నైల్ పాలిష్ వేసుకుంది.

పటాస్ కామెడీ షో తో బుల్లితెరపై మంచి క్రేజ్ తెచ్చుకున్న శ్రీముఖిని ఫాన్స్ ముద్దుగా రాములమ్మ అని పిలుస్తారు.

బిగ్‌బాస్ 3 లో అందరితో పోటీపడి ఆఖరి వరకు టైటిల్ కోసం పోరాడిన శ్రీముఖి రన్నరప్‌గా నిలిచింది.

అల్లు అర్జున్ నటించిన జులాయి చిత్రంలో అతని చెల్లెలి క్యారెక్టర్ లో నటించిన శ్రీముఖి ,ఆ సినిమాతో ఫిలిం ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.

ప్రస్తుతం శ్రీముఖి బుల్లితెర లో షోస్ మాత్రమే కాకుండా ….ఈవెంట్స్ లో కూడా ఆక్టివ్ గా పాల్గొంటూ స్టేజీపై సందడి చేస్తోంది.
 
					 
		