తమిళ్ లోనే కాకుండా తెలుగులో కూడా మంచి పాపులారిటీ తెచ్చుకున్న నటుడు ధనుష్. వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ఈ క్రేజీ స్టార్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం కెప్టెన్ మిల్లర్. ఈ చిత్రం 1930 -40 కాలంలో జరిగిన ఓ యదార్ధ గాధ నేపథ్యంలో చిత్రీకరించబడుతోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర బృందం మూవీ మేకింగ్ లింక్స్ ను విడుదల చేసింది.

ఈ మూవీ కోసం మొత్తం మూవీ యూనిట్ డెడికేషన్ తో ఏ రేంజ్ లో కష్టపడుతున్నారో ఈ గ్లిమ్స్ వీడియోలో చూడవచ్చు. ప్రస్తుతం ఈ వీడియో నెట్లో వైరల్ గా మారింది. వీడియో స్టార్టింగ్ లోనే చిత్రానికి సంబంధించిన సెట్స్ వేయడం చూపించడం జరిగింది. మూవీ షూటింగ్ కి సంబంధించిన ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ చిత్ర యూనిట్ పడుతున్న కష్టం ఈ వీడియోలో చూడవచ్చు.
1930 నాటి యుద్ధ ఆయుధాలను ,అప్పటి వేష భాషలను, పద్ధతులను ఎంతో వినూత్నంగా రూపొందించడం మనం ఈ వీడియోలో చూడవచ్చు. అంతేకాకుండా మూవీ షూటింగ్ కోసం అత్యాధునిక టెక్నాలజీ కలిగిన కెమెరాలు మరియు సాంకేతిక పద్ధతులను వాడడం కూడా మనం ఈ వీడియోలో చూడవచ్చు. ఈ ఒక్క గ్లిమ్స్ రాబోయే చిత్రం మీద అంచనాలను భారీగా పెంచింది అని చెప్పడంలో సందేహం లేదు.

ధనుష్ తో పాటు టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ ఈ మూవీలో ఓ కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీని సత్య జ్యోతి ఫిలిం భారీ బడ్జెట్ తో బ్యాంకు రోల్ చేస్తుంది. త్వరలో షూటింగ్ పూర్తిచేసుకుని ఈ చిత్రం ఒకేసారి తెలుగు, తమిళ్ మరియు హిందీ భాషలో విడుదల కానుంది.
Also Read : సుశాంత్ సింగ్ పుట్టిన రోజును అనాథ పిల్లలతో కలిసి జరిపిన సారా అలీ ఖాన్……