Connect with us

Balakrishna : ఒక్క కట్ లేకుండా సెన్సార్ బోర్డుకే షాక్ ఇచ్చిన సినిమా ఎంటో తెలుసా…

balakrishna

Latest News

Balakrishna : ఒక్క కట్ లేకుండా సెన్సార్ బోర్డుకే షాక్ ఇచ్చిన సినిమా ఎంటో తెలుసా…

Balakrishna : 1994 లో చందమామ విజయ కంబైన్స్ నిర్మించిన జానపద చిత్రం ‘భైరవద్వీపం’. ఈ సినిమాలో బాలకృష్ణ, రోజా ప్రధాన పాత్రలో నటించారు. ఈ చిత్రం ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. అయితే, ఈ సినిమా సెన్సార్ చేసినప్పుడు ఒక్క కట్ కూడా లేదని చెప్పారట. కానీ, సెన్సార్ పూర్తయిన తర్వాత వాళ్ళు ఒక హెచ్చరిక చేసారట.

bhairava_dweepam
#bhairava_dweepam

గుర్రాలు పడిపోయిన షార్ట్స్ గురించి చెబుతూ మా వరకు అభ్యంతరం లేదు. కానీ వన్యప్రాణి సంరక్షణ సంఘం వాళ్ళు అభ్యంతరం పెడితే మాత్రం గుర్రాలు పడిపోయిన షార్ట్స్ ని తొలగించమంటారు అని చెప్పారట. అయితే సినిమా విడుదల తర్వాత ఆ సన్నివేశాలు వాళ్ళ దృష్టిలో పడలేదు. అలా ఆ సినిమా ఒక్క సెన్సార్ కట్ లేకుండా విడుదలై ఘన విజయం సాధించింది. అయితే గుర్రాలు పడిపోయే విధానం చూస్తే మాత్రం వన్యప్రాణి సంరక్షణ సంఘం వాళ్ళు అంగీకరించరు. గుర్రాలు చాలా వేగంతో పరిగెత్తుతూ వస్తుంటాయి. వాటి కాళ్లకు అడ్డం తగిలేలా వైర్లు కడతారు.

bhairava_dweepam
#bhairava_dweepam

గుర్రాల కాళ్లకు వైర్లు అడ్డం రాగానే అవి పడిపోతాయి. అలా పడిపోవడంలో వాటి కాళ్లు విరగవచ్చు, దెబ్బలు తెగలవచ్చు. కాస్త రిస్క్ తో కూడుకున్న సన్నివేశాలు అవి. వెంటనే గుర్రాల యజమానులు వచ్చి పడిపోయిన గుర్రాలను లేపి కాళ్లు, ఒళ్ళు చూస్తారు. కొన్ని నడవలేని స్థితిలో ఉంటే వెంటనే వైద్యుడికి చూపించి వాటికి చికిత్స చేయించే వాళ్ళు. బాలకృష్ణ కథానాయకుడిగా, సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. జానపద హీరోగా బాలకృష్ణ అద్భుతంగా నటించారు.

READ ALSO  ఆస్కార్ వేడుకలో దీపికా చేసిన పనికి ప్రశంసల వెల్లువ...
google news
Continue Reading
To Top