మెగా బ్రదర్స్ లో ఒకరైన నాగబాబు కూతురు.. మెగా డాటర్ నిహారిక కొణిదల. తెలుగు ఇండస్ట్రీలో ఈమె పేరు తెలియని వారు ఉండరు. సినిమాల పరంగా కాకపోయినా కాంట్రవర్సీల పరంగా నిహారిక అందరికీ పరిచయస్తురాలు. మొదట బుల్లితెరపై యాంకర్ గా తెరంగేట్రం చేసిన ఈ బ్యూటీ ఆ తర్వాత హీరోయిన్ గా నాగశౌర్యతో మూవీలో నటించింది.ఒక మనసు చిత్రంతో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన నిహారిక తను నటనతో అందరిని ఆకట్టుకుంది. సినిమాలతో పాటు పలు రకాల షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

జొన్నలగడ్డ చైతన్యను పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాల నుంచి ఈమె బ్రేక్ తీసుకుంది. అయితే సోషల్ మీడియాలో తనకు సంబంధించిన ఎన్నో విషయాలను షేర్ చేసుకుంటూ ఉండేది. కొన్ని పరస్పర విభేదాల కారణంగా ఆమె రీసెంట్గా భర్త నుంచి విడాకులు తీసుకుంది. ఆ తర్వాత మెల్లిగా తన కెరీర్ పై ఫోకస్ పెడుతూ వెబ్ సిరీస్ ద్వారా ప్రజలకు చేరువైంది. ఇప్పుడు ఆమె తిరిగి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతోంది.

ఈ వార్తను నిహారికతో పాటు ఆమె నటించబోతున్న మూవీకి సంబంధించిన మేకర్స్ కూడా అధికారికంగా ప్రకటించారు.వాలి మోహన్ దాస్ డైరెక్షన్లో ఎస్సార్ ప్రొడక్షన్ బ్యానర్ పై.. జగదీష్ నిర్మిస్తున్న మూవీలో హీరోయిన్గా నిహారిక తిరిగి రీఎంట్రీ ఇవ్వబోతోంది. రీసెంట్ గా భారీ విజయాన్ని అందుకున్న ఆర్డీఎక్స్ మూవీ ఫేమ్
నిగమ్ ఈ మూవీలో హీరోగా నటిస్తున్నాడు.’మద్రాస్ కారన్’టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నిహారిక కొణిదల హీరోయిన్గా ఫిక్స్ అయినట్లు చిత్ర బృందం ప్రకటించారు. మరోపక్క ఇదే విషయాన్ని నిహారిక తన ఇంస్టాగ్రామ్ పోస్ట్ ద్వారా వెల్లడించారు. నిహారిక పెట్టిన ఈ పోస్టుకు మెగా అభిమానులు స్పందించడంతోపాటు ఆమెకు అభినందనలు తెలియజేశారు. ఈ మూవీ ద్వారా ఆమె మంచి పేరు తెచ్చుకోవాలని వారు భావిస్తున్నారు.
