Actress Saritha: బాలచందర్ వద్దన్నారు.. స్టార్స్ సరితనే కావాలన్నారు

హీరోయిన్ గా ఎంత పాపులరో.. డబ్బింగ్ ఆర్టిస్టుగా అంతే పాపులర్ అయిన స్టార్ సరిత(Actress Saritha). తన గొంతుతో ఎంతో మంది స్టార్ హీరోయిన్ల కెరీర్ ను మరో మెట్టు ఎక్కించారు. డబ్బింగ్ ఆర్టిస్టుగా (Dubbing Artist) తను ఎంత పాపులర్ అంటే హీరోయిన్లందరూ తనతోనే డబ్బింగ్ చెప్పించుకోవాలని కోరుకునేంతగా. అందుకే ఓ వైపు హీరోయిన్ గా నటిస్తూనే.. మరోవైపు డబ్బింగ్ ఆర్టిస్టుగానూ సక్సెస్ అయ్యారు. కానీ బాలచందర్ (Balachander) మాత్రం ఆమెను డబ్బింగ్ ఆర్టిస్ట్ గా వద్దు అన్నారు.

#image_title

ఒకప్పటి టాప్ హీరోయిన్లందరకీ డబ్బింగ్ చెప్పారు సరిత. వారిలో విజయశాంతి, నగ్మా, సౌందర్య, రాధ, సుహాసిని లాంటి అగ్రకథానాయికలున్నారు. హీరోయిన్ నటనకు తగ్గట్టుగా డబ్బింగ్ చెప్పడంలో సరిత దిట్ట. అసలు సరితకు డబ్బింగ్ చెప్పే అవకాశం ఎలా వచ్చింది? ఓ సందర్భంలో సరిత ఈ విషయాన్ని వివరించారు.

సంచలన ప్రేమకథా చిత్రం మరోచరిత్ర సరిత మొదటి సినిమా. ఆ సినిమాకు సరితతో డబ్బింగ్ వద్దంటే వద్దు అన్నారు దర్శకుడు బాలచందర్. ఆయన అలా అనడానికి కూడా ఓ కారణం ఉంది. మరోచరిత్ర సినిమాకు వాయిస్ రికార్డింగ్ చెన్నైలోని ప్రసాద్ థియేటర్లో జరిగింది. ఈ సినిమాకు డబ్బింగ్ చెప్పే సమయంలో.. అసలు సరిగ్గా చెప్పలేకపోయారట సరిత.

#image_title

ఎందుకంటే.. తనని తాను స్క్రీన్ మీద చూసుకుని ఆనందపడిపోయిందట. ఆ ఆనందంలో సరిగ్గా మాట్లాడలేకపోయారట. పైగా అప్పటికి సినిమా రిలీజ్ డేట్ దగ్గరగా ఉండటంతో.. బాలచందర్ కాస్త కంగారుపడ్డారట. ఈ అమ్మాయి ఇలాగే డబ్బింగ్ చెబితే.. పదిరోజులైనా పూర్తవదని ఫీలయ్యారట. కాబట్టి వేరే వాళ్లతో డబ్బింగ్ చెప్పించేయెచ్చు అనుకున్నారట.

అయితే సౌండ్ ఇంజనీర్ మాత్రం వద్దు ఈ అమ్మాయి గొంతు చాలా బాగుంది. ఆమెకు కాస్త టైం ఇచ్చి చూడండి అని చెప్పారట. ఓ అరగంట ప్రయత్నించిన తర్వాత డబ్బింగ్ ఎలా చెప్పాలో టెక్నిక్ తెలుసుకుని దాన్ని కంప్లీట్ చేశారట. అప్పటి వరకు సరితకు కూడా తన వాయిస్ వినసొంపుగా ఉంటుందనే విషయం తెలియదట.

#image_title

అలా మొదటిసారి తన పాత్రకు డబ్బింగ్ చెప్పుకున్నారు సరిత. మరోచరిత్ర సినిమాలో ఆమె నటనతో పాటు.. గొంతుకు కూడా మంచి మార్కులు పడ్డాయి. కొంతకాలం హీరోయిన్ గా కొనసాగిన తర్వాత డబ్బింగ్ చెప్పేందుకు అవకాశాలూ వచ్చాయి. ఇప్పటికీ ఆమె డబ్బింగ్ ఆర్టిస్టుగా కెరీర్ ను కొనసాగిస్తున్నారు.

google news

Leave a Comment